ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0001-05 దేవగాంధారి సం: 10-005
పల్లవి:
ఏమొకొ నేమేమొకో
యీ మోహము మానమేమొకో
చ. 1:
కావరించినట్టి కాఁపురములలో
నీవలావలయ్యే మేమొకో
దావతిసుఖమిల దారి దెలిసియు
నేవగించలే మేమొకో
చ. 2:
గాలపుఁజిక్కుల కర్మపుతొడసుల
యీలకరచే మేమొకో
తాలిమిచెరిచెటి ధనముమీఁదివాంఛ
యేలొ యింకా మాన మేమొకో
చ. 3:
వోడుపోయినట్టి వుంగిటిబతుకుల
యీడగిలఁబడే మేమొకో
వేడుకతో శ్రీ వెంకటనాథుఁడు
యీడనె మముఁ గాచె నేమొకో