Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0002-01 మలహరి సం: 10-006

పల్లవి:

హరికి మొరవెట్టితె అన్నిపనులు లెస్సవును
సరవి నెన్నాళ్లని జాలిఁ బడవచ్చును

చ. 1:

యేమిసేయేనీజీవుఁ డీయరివర్గాలతోడ
బూమెల నెన్నాళ్లని పోరాడీని
చూమరలఁ జూడఁ జూడఁ జుట్టాలవలనె వుండి
దోమటిపంచేంద్రియాలు దోడుగాకపోయను

చ. 2:

యెక్కడచొచ్చీజీవుఁడీ కర్మపురుణములు
పెక్కు విధములఁ బిరువీకు సేయఁగా
వొక్కొక్కనాఁటివడ్డె వొదిగీఁగాని తల
తిక్కగొన్న పాపములు దీరకెపోయను

చ. 3:

యెవ్వరుదిక్కీ జీవుని కెంతని యీఁదఁగలఁడు
యివ్వల సంసార మనె యీవారిధి
నవ్వుతా శ్రీవెంకటనాథుని మఱఁగుచొచ్చి
యివ్వగఁ దా దరిచేరి యిన్నియు గెలిచెను