Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0001-04 గుజ్జరి సం: 10-004

పల్లవి:

మచ్చరములుఁ గపటంబులు మానినంత మరికదా
విచ్చలవిడి నాయాసల వీఁగఁదోల నోపుటా

చ. 1:

చంచలమగు నామనసిది మంచిదైన మరికదా
పంచేంద్రియముల పోరునఁ బడకమానుటా
కొంచెపరచునాకోపముఁ గోసివేసి మరికదా
కంచపుఁ బాపంబులలోఁ గడతేరుటా

చ. 2:

వుడివోని దీపనమున కోరిచినె మరికదా
జడివట్టిన నాజిహ్వచాపల్యము మానుటా
చిడుముడి నాభోగంబులఁ జిక్కువడక మరికదా
విడువని సంసార మనెటివెల్లి దాఁటనోపుటా

చ. 3:

తరితీపులమోహంబునఁ మరికదా
కెరలిన యీలోభంబున గెలువ నోపుటా
నెరవుగ శ్రీవిష్ణుభక్తి నిలుకడైన మరికదా
గరగరికలనె శ్రీవెంకటనాథునిఁ జేరుటా