Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0001-03 దేసాక్షి సం: 10-003

పల్లవి:

ఎన్నటికి నీకు జీవుఁడా యిదియె బుద్ది వోజీవుఁడా
మన్నించిన నీగురువులపాదము మఱవకువో వోయిజీవుఁడా

చ. 1:

మాటచెప్పెఁద జీవుఁడా మారు మాఁటలేటికి జీవుఁడా
నాటకంబుల పంచేంద్రియముల నమ్మకు వో వో జీవుఁడా
చాటితిఁ జుమ్మీ జీవుఁడా నీకుఁజాటువో హరిభక్తి జీవుఁడా
కూటువగూడిన కామక్రోధాదులఁ గూడకువో వోయిజీవుఁడా

చ. 2:

ఎప్పుడు మనసులో జీవుఁడా హరిఁ దప్పక తలఁచవో జీవుఁడా
తప్పుఁదెరువుల దేవతాంతరాలు దడవకువో వోయిజీవుఁడా
దప్పిఁబడనేల జీవుడా నీవు ధన్యుఁడ వవుదు వోజీవుఁడా
చిప్పిలువేడుక శ్రీవెంకటనాథు సేవించవో వోయిజీవుఁడా