Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0009-05 సామంతం సం: 10-053

పల్లవి:

తోఁటకూరదొంగలాల తొయ్యలులాల
నాఁటకపు మీమోహము నమ్మ నెట్టువచ్చును

చ. 1:

పాపపుణ్యపు టోఁదాలపాలు సేసి జీవులను
చూపలనె భ్రమయించే సుద్దులు మీవి
దాపుదండై శ్రీవిభుఁడు తానె కాచెఁగాక
యేపున రిత్తవారి మీ రెంతంత సేయరు

చ. 2:

కీడు మే లనె వురులఁ గీలించి మనుజులఁ
బాడితోనె యెంచెటిభావము మీది
యీడేరించి నాగురుఁడు యిందిరేశుఁ జూపెఁగాక
యీడనె రుత్తవారి మీ రెంతంతసేయరు

చ. 3:

చావుఁ బుట్టుగు లనెటి సముద్రాలఁ బడఁదోసి
జీవులను విసిగించేచిత్తము మీకు
శ్రీవెంకటనాథుఁడె చేపట్టి మమ్మేలెఁగాక
వేవేగనఁ బేదలచే వెట్టి యెంతగొనరు