Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0009-03 మాళవిగౌళ సం: 10-051

పల్లవి:

శ్రీపతిపురనాయకా జయచింతితాభీష్టదాయకా

చ. 1:

వున్నతోన్నతవిగ్రహ దాసోపరిస్థానుగ్రహా
నన్ను తామరగసుగ్రహా సామవదపరిగ్రహా

చ. 2:

జానకీప్రియకారకా శివసాధితాఖిలతారకా
మానుషాహితమారకా మామకాఘనివారకా

చ. 3:

శ్రీవెంకటనాథరూపకా సంచితరఘకులదీపకా
భావసంతోషప్రాపకా అభంగమంజులచాపకా