Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0009-02 పాడి సం: 10-050

పల్లవి:

తానేడ వారేడ తనువేడ మరి తక్కినవెల్లానేడ
మానలే ననుచు తరితీపు సేసే మన సేడ నుండునో

చ. 1:

కందువమానిపై నోరూరించెటికాయలుఁ బండ్లుపక్వముదప్పిన
అందముగ మున్ను గోరినట్టివారి యాసలెందుండునో
పొందున వలచి పులకించినట్టి పురుషులు సతులట్టెముదిసితె
ముందర వెనక నెరఁగనియ్యనిమోహ మెందుండునో

చ. 2:

కొత్తమెరుఁగులచేత భ్రమయించే కోకలు చివిరె పాఁతగిలితె
బత్తితోఁ గావలె నని కొన్నవారిభ్రమ లెందుండునో
రిత్తజవ్వనాన కొప్పుగోళ్ల దిద్ది రీతిగానుండెటి సింగారంబులు
పత్తివలెనై బట్టగట్టఁదనభావ మెందుండునో

చ. 3:

తావితో బుగులుకొనెటివూవులు దాఁపఁగ నవియె వాడినపిమ్మట
భావించి చూచితే నందలి తొల్లిటిపస యెందుండునో
శ్రీవెంకటనాథుఁ డిట్టె యేలెఁగాకచెల్లఁ బో తాఁదొల్లి భోగించినవెల్ల
వేవేగ మరునాఁ డవియె చూడ నేవిధమైయుండునో