Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0009-01 లలిత సం: 10-049

పల్లవి:

ఏలికయైన హరి నేల మరవఁగవలె
పాలుమాలి మరియాల భంగపడవలెను

చ. 1:

యిరుకుమానిసంది నేఁటికిఁ జొరవలె
తిరుగలేక యేల తినుకవలె
యెరవులవిషయాల నేల పొరలవలె
కొరగాని పాపాలగొడ వేలవలెను

చ. 2:

మిగుల వురులలోన మెడ యాల పెట్టవలె
తగిలించుకొని యేల పొగులవలె
యెగసక్కెపుఁగోరిక లేల కోరవలె
జిగురువంటిబందాలఁ జిక్క నేలవలెను

చ. 3:

పారేబండికింద పాద మేల చాఁచవలె
జారుపడి మరియాల జడియవలె
మీరి శ్రీవెంకటనాథు మిక్కిలివేడుకఁ గొల్చి
పోరుమాలివుండ కేల పొడిఁబడవలెను