Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0008-04 రామక్రియ సం: 10-046

పల్లవి:

నీవుగలిగినఁ జూలు నిక్కము అన్నీఁ గలవు
ఆవల మాయాచార్యుఁ డానతిచ్చెనయ్యా

చ. 1:

యేలోకముననున్న యెడయనిసామ్ము నీవె
తాలిమి యెందుఁ బోనిధనము నీవె
కాలముకడాతరగని ధాన్యము నీవని
ఆలించి మాగురుఁ డిట్టె ఆనతిచ్చెనయ్యా

చ. 2:

యెందెందుం దిరిగిన యేలికవు నీవె
నిందలేనియట్టి తోడునీడవు నీవె
ముందువెనకల నిల్లు ముంగిలియు నీవె యని
అందముగ దేశికుఁడె ఆనతిచ్చెనయ్యా

చ. 3:

యెన్నఁడుఁ గలఁగనట్టి హితుఁడవు నీవె
పన్నినట్టెవుండె నిచ్చపంటా నీవె
నన్నుఁ గాచే శ్రీవెంకటనాథుఁడ వని తాళ్లపా
కన్నమయ్యంగారె నాకు నానతిచ్చిరయ్యా