Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0008-03 సాళంగనాట సం: 10-045

పల్లవి:

ఎటులఁబుట్టించితో నీవెరుఁగుదువు
ఘటన నన్నియు నీసంకల్ప మేఅయ్యా

చ. 1:

చచ్చేవారిఁజూచి చావుకు వెరతుగాఁన
రొచ్చులసంసారముప రోతుఁగాని
కచ్చుపెట్టి ఆదియె కాలాఁజేతాఁబెనఁగఁగ
మచ్చికసేయుదుఁగాని మానలేనయ్యా

చ. 2:

బడలేవారిఁ జూచి బడల నోపఁగాన
విడువనిసంపదపై విసిగేఁగాని
పెడవాయ కదియె పెరుగుచురాఁగాను
బడిఁ దిరుగుదుఁగాని పాయలేనయ్యా

చ. 3:

ములిగేవారిఁ జూచి ములుగ నోడుదుఁగాన
శిలుగుఁగోరికలఁ గోసితిఁ గాని
కలిమితో శ్రీవెంకటనాథ నీభక్తి
వెలయఁ గోరుదుఁగాని విడువలేనయ్యా