Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0007-01 సాళంగనాట సం: 10-037

పల్లవి:

తన దాసునికొరకు ధరియించె నీరూపము
దిన దిన వేడుకఁ గదిరి నారసింహుఁడు

చ. 1:

బలురక్కసు నొడిసిపట్టి తొడలపైఁ బెట్టి
చెలఁగి కొనగోళ్లఁ జించినాఁడు
చలపట్టి పేగులజంధ్యాలతోడుతను
తెలివై వున్నాఁడు కదిరి నారసింహుఁడు

చ. 2:

ఘెరధానవు కంఠకుహర రక్తము ముంచి
సారెకు వసంతముగాఁ జల్లినాఁడు
మారుకొన్నదైత్యుని చర్మ మొలిచి మేనిమీఁద
ధీరతఁ గప్పిఁనాఁడు కదిరి నారసింహుఁడు

చ. 3:

అందపులక్ష్మియు బ్రహ్లదుఁడు నుతింపఁగాను
విందుగా నాగముపాల వెలసినాఁడు
అంది శ్రీవెంకటనాథుఁడై యీడా నాడాను
దిందుపడున్నాఁడు కదిరి నారసింహుఁడు