Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0005-05 మలహరి సం: 10-029

పల్లవి:

నిండునిధానమువలె నీవు గలిగుండఁగాను
పండినయోగికిఁ బూర్ణభావనె మంచిది

చ. 1:

కలకాలము భూమిఁ గతలె వింటిమిగాని
నలనహుషాదు లున్నారా యేమి
యిలలో నితరు లెల్లా నేమి లేక్క యిందుకుఁగా
యెలయింపువిషయాల యేమరఁగఁ దగునా

చ. 2:

చేపట్టి పురాణాలు చెప్పఁగా వింటిమి గాని
బాపురె దుర్యోధనుసంపద యేది
కాపాడ నిప్పటివారికలిమి యెంచఁగ నేది
యీపాటిపనికిఁగా నిది గోరఁ దగునా

చ. 3:

మళ్లీ మళ్లీ భూమిలోన మాటలె వింటిమి గాని
తొల్లిటి బలాఢ్యుల సత్తువ లేవి
వెల్లవిరై యెప్పుడూ శ్రీవెంకటనాథ నీదాసు
లెల్లకాలముఁ జెడని యీబలిమె నిజము