Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0005-04 గుజ్జరి సం: 10-028

పల్లవి:

చలమె చెల్లించుకొన్న సతులాల
సులభమా మీతోపొందు సుతులాల

చ. 1:

వ్రతినైన యతినైన వలలమాటలఁ బెట్టి
బతిమి చెరుతురుగా బంధువులాల
హితవరులువలెనె యింత నంత నెలయించి
తతిగొందురుగా ధనధాన్యములాల

చ. 2:

పెద్దనైన పిన్ననైన పెలుచుఁదనమె రేఁచి
కొద్దిమీరించిన కామక్రోధములాల
అద్దొ యెంతవిరక్తు నైనా విషయాలకె
తిద్దితిరిగా పంచేంద్రియములాల

చ. 3:

మునినైన ఋషినైన మోహమె పెంచి మరపి
మొనసితిరిగా యిల్లు ముంగిళ్లాల
ఘనుఁడైన శ్రీవెంకటనాథుపాదములు
చనవునఁ జూపతి రాచార్యులాలా