Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0005-03 నారాయణదేసాక్షి సం: 10-027

పల్లవి:

ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుఁడె కాకా

చ. 1:

యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
మెవ్వరు స్వతంత్రు లిందులో
అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన
యవ్వనజాక్షుని ననుట గాకా

చ. 2:

యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే
మెందుఁ గద్దు మే లిందులో
అందు నిందుఁ దానె యల్లుకొన్న
నందనందనునే నమ్ముట గాకా

చ. 3:

యేచోటు మంచిది యేచోటు చెడ్డది
యేచోటు సతమౌ నిందులో
కాచేటి శ్రీవెంకటనాథుఁడె
చేచేతఁ గాణాచై చెళ్లించెఁ గాకా