Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0005-01 గుండక్రియ సం: 10-025

పల్లవి:

వట్టివిచారము లేల వలవని చింత లేల
దిట్టతనాన రక్షించ దేవుఁ డుండఁగాను

చ. 1:

తానె బుద్దెరిఁగితే తప్పులేల వచ్చీని
మానక యేలిక లెస్స మన్నించుఁ గాక
మేనిలోఁ బాపము లేక మించిన భయ మేఁటికి
ఆనుకొని రక్షించ శ్రీహరి యుండగాను

చ. 2:

చేరి తానె కొలిచితే జీత మేల తప్పీని
భారకుఁడై దొరయే చేపట్టుఁ గాక
మారుముద్ర గాని మంచిమాడకు వట్టము లేల
తారుకాణగా హరి తానె రక్షించుఁ గాక

చ. 3:

చనవె కలిగితేను సలి గేల తప్పీని
తన చెప్పినట్టు రాజు తాఁ జేసుఁగాక
పనివడి రాచవారి పనులకు బందె యేది
నను శ్రీవెంకటగిరినాథుడు రక్షించఁగా