ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0004-06 దేవగాంధారి సం: 10-024
పల్లవి:
నేరి చెవ్వఁడు బ్రదికె నేరక యెవ్వఁడు చెడె
భారకుఁ డందరికి శ్రీపతి యింతె కాక
చ. 1:
వొక్కరి నేరము లైతె నూరకె వెడకఁ జూచే
నక్కటా నాగుణదోషా లవి యెంచను
వొక్కటై విచారించితే వొరు లేమి తా నేమి
అక్కడ నిక్కడ గురి హరి యింతె కాక
చ. 2:
దట్టిచి వొక్కరి నైతె తప్పు లెంచఁ జూచేను
అట్టే నాయపరాధాల కాజ్ఞ యేదో
నెట్టనఁ దలపోసితే నేనేమి పరు లేమి
గట్టిగా స్వతంత్రుడు శ్రీకాంతుఁ డింతె కాక
చ. 3:
వూరకె వొక్కరి నైతే వొచ్చములు వట్టేను
కారుకమ్మినట్టి నాకల్ల లెంచను
గారవించి శ్రీవెంకటనాథుఁడు నన్ను
సారెకు రక్షించఁగాను జయ మాయఁ గాకా