Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0004-03 మాళవిగౌళ సం: 10-021

పల్లవి:

మనసె వశమైతేఁగా మరి మీఁదటిపనులు
తనువులోపలి హరిదయ యింతె కాకా

చ. 1:

వొద్దనె పుత్రమిత్రాదు లువ్విళ్లూరించఁగాను
అద్దొ వైరాగ్య మేమి ఆటపాటలా
కొద్దిలేనివిషయాలు గుంపు గూడు కుండఁగాను
వద్దని కడకుఁ దోయ వశ మవునా

చ. 2:

వొయ్యనె ధనధాన్యాలు వొడ్డుకొని వుండఁగాను
అయ్యో సుజ్ఞానము లల్లాడఁబడెనా
గయ్యాళికోరిక లెల్లా గమిగూడ కుండఁగాను
పుయ్యక దూలయాసలఁ బోఁదోల వసమా

చ. 3:

పల్లదపుటాఁక లిది పాయక వుండఁగాను
చెల్లఁబో వోరుపు లింత చెడఁబోయనా
నల్లని శ్రీవెంకటనాథుఁడె యందరికిని
తల్లి దండ్రియై కావఁగా తప్పువాసెఁ గాకా