Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0004-02 మలహరి సం: 10-020

పల్లవి:

సంకె లేక తలఁచిన జాణలకు
సంకీర్తనమెపో సర్వశాంతి

చ. 1:

భవహరమగు శ్రీపతి నామమె
జవకట్టి తలఁచితే జన్మశాంతి
తవిలి హరిపూజ తాఁ జేయుటె
కువలయమున నిదిగో గృహశాంతి

చ. 2:

అంది ధ్రువవరుఁదుడ యనినదే
కందువైన సర్వగహశాంతి
యిందురవినయనుని నెరుఁగుటె
చందమైన దిదివో నక్షత్రశాంతి

చ. 3:
భావించి యనంతునిఁ బలుకుటే
కావించిన దిదివో కాలశాంతి
శ్రీవెంకటనాథునిఁ జేరుటె
దేవమానవులకును దేహశాంతి