Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి .ఆ. రేకు: 0003-06 మలహరి సం: 10-018

పల్లవి:

తలఁ పెన్నఁడు నినుఁ దగులునయ్యా
చల మెన్నఁడు కడచనునోయయ్యా

చ. 1:

మోహం బెన్నఁడు ముదుసునయ్యా
దాహం బెన్నఁడు తలఁగునయ్యా
సాహస మెన్నఁడు జరగునయ్యా
శ్రీహరి తెలియఁగ జెప్పఁగదయ్యా

చ. 2:

కపటం బెన్నఁడు గడచునయ్యా
చపలత లెన్నఁడు జారునయ్యా
నిపుణత లెన్నఁడు నెగడునయ్యా
ప్రపంచముగ హరి పలుకఁగదయ్యా

చ. 3:

మచ్చర మెన్నడు మానునయ్యా
నిచ్చల మెన్నఁడు నిలుచునోయయ్యా
గచ్చుల శ్రీవెంకటనాథ
పచ్చిదేర హరి పలుకఁగదయ్యా