Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-2 శంకరాభరణం సం: 10-115

పల్లవి:

ఒగ్గాలివాఁడు గదె వోయమ్మా
సిగ్గున నా కగపడె చిలుకచందమునా

చ. 1:

తలఁచుకొంటేఁ జాలు తా నాడ కేగునమ్మా
వొలసి కమ్మగట్టు పావురమువలే
నెలత మదిఁ బారితే నిదురే కానఁడమ్మా
చలపాదిరా తిరిటి జక్కవచందమునా

చ. 2:

ముదిత యెలుఁగు వింటే మొక్కలాన వాలునమ్మా
బెదరని పెంపుడుఁ బికిలివలే
సుదతి వుండిన యింటిచుట్టూఁ దిరుగునమ్మా
చెదరని మతితోడ జీనువవలెను

చ. 3:

గోమున నో యని యంటే గొబ్బున నోయనునమ్మా
కోమలపు వసంతపు కోవిలరీతి
కామించి మమ్మును శ్రీవెంకటనాథుఁడు గూడె
రామలలోఁ బాయలేని రాయంచవలెను.