Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-1 పాడి సం: 10-114

పల్లవి:

వేళావేళలు లేవా వినోదములకై నాను
యేలా తమకించి వస్తే యిది నీ వెఱఁగవా

చ. 1:

అయ్యో సారె నన్ను నలయించే వేరా
వొయ్యారపువాఁడ యింత కోపుదునా
చయ్యాటాన జాజిమొగసానఁ బట్టే వేరా
నెయ్యపు నాతలఁ పిది నీ వెఱఁగవా

చ. 2:

యిటె మాఁటిమాఁటికి యేఁచే విదేమిరా
పట్టిన నీ చలాన నేఁ బడఁగలనా
వుట్టిపడి చిగురాకు వుక్కఁ బెట్టే వేరా
నెట్టెన నా వల పిది నీ వెఱఁగవా

చ. 3:

చాలాఁ దరితీపుల సటలు సేసే వేరా
బాలకి నింతే నిన్నుఁ బాయ గలనా
మేలిమి దామెరలోఁ దుమ్మిద గూడినటునన్ను
యేలి శ్రీవెంకటనాథ యిది నీ వెఱఁగవా.