ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 19-6 సాళంగనాట సం: 10-113
పల్లవి:
జాజరవలపు జాణఁడే
వోజ దప్పఁడుగా నోయమ్మా
చ. 1:
పూని పిలువఁగ నొల్లక పోయిన
మేనవాఁడ ననీ మేలే
మానలేక పోయి మళ్లివస్తి నని
ఆనవెట్టీఁ జవు లవునట్టే
చ. 2:
పట్టి పెనఁగఁగ బరాకు సేసిన
చుట్టెమ ననీఁ జూడరే
నెట్టెన నాఁటికి నేడు వస్తి నని
దిట్టెమాఁట లాడీ దెలిసెనా
చ. 3:
చెయివట్టినాఁ జేరరాకుంటే నా
ప్రియుఁడనీఁ బ్రేమతో
కయికొని శ్రీవెంకనాథుఁ డిట్టె
పయి పయి నన్నుఁ బాలించెనే.