Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 19-5 శ్రీరాగం సం: 10-112

పల్లవి:

తామెరయాఁటదియును భువిలో దప్పులఁ బొరలఁగఁగలదా
కామించిన తన కులపురుషని కరముల నలమినఁ గాకా

చ. 1:

ఇందుకళామౌళికి నతనుని కేకాలము వైరము గాదా
కందువతో బున్నమ గాఁగా గండము గడచే
ముందరనె యెనసెటిశరములముం బారముగడపఁగవసమా
అందముగా నడుములయమ్ములు అసిఁ బోయఁ గాకా

చ. 2:

కమలోత్పత్తికి హిమరుతువుకుఁ గలకాలము వైరము గాదా
అమలాంబరమునుఁ గూడఁగ నాపద గడచే
అమరంగాఁ జక్రముఁ బాపిన అదియునుఁ గడవఁగవశమా
క్రమమునహంసాగమమునఁ గడతేరెఁ గాకా

చ. 3:

నీలాంబుదశిఖకును గాలికి నిక్కముగా వైరము గాదా
మేలిమి మీఁదటి యోగము పేర్మినీబాదలు గడచే
ఆలించిన నదియ అపూర్వం బైననుఁ గడవఁగ వశమా
తాలిమి శ్రీవెంకటనాథుఁడు తాఁగూడఁగ బ్రతికెఁ గాకా.