Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0003-04 సామంతం సం: 10-016

పల్లవి:

అల్లము బెల్లమౌనా అన్నలాల
యెల్లకాలమును గుణ మేల మానీనయ్యా

చ. 1:

నిక్కము గొండలనీరు నేలకు వేగమె పారు
యెక్కువనేలపై నీరు యెక్కు దందుకు
మిక్కిలి ప్రకృతిలోన మెలఁగెటివానికి
చొక్క మైనజ్ఞాన మెట్టు సొగసీనయ్యా

చ. 2:

అచ్చపుఁబాలలోన తోడంటితేనె పెరుగౌను
పచ్చి సేసినఁ బెరుగు పాలు గాదు
వచ్చి వచ్చి యెఱఁగనివానికిఁ దెలుపవచ్చు
కుచ్చితుని నెటువలె గుణిఁ జేసేదయ్యా

చ. 3:

చందనపువానలు సంగడి మాఁకుల నంటు
అందలివాన లిందు నంట వెన్నఁడు
కందువైన శ్రీవెంకటనాథుని దాసు
లెందుండినా నితరము లేల తోఁచీనయ్యా