Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 19-1 దేసాళం సం: 10-108

పల్లవి:

ఏమి మందు గద్దె యింతు లాల యీ
రామకుఁ దిరుపతి రాముడే మందు

చ. 1:

వెలసెటి విరహన వేఁగెటియింతికి
చెలియలాల యేమి సేతమే
చలివేఁడివలపుల చవి గన్న యీపెకు
వలపించిన తనవరుఁడే మందు

చ. 2:

పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు
చెదరక మన మేమి సేతమే
వుదుటుఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగఁడే మందు

చ. 3:

పొల్లవోని యాసఁ బొరలెటి మగువకు
చెల్లఁ బో మన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁడీపెకు
నల్లని శ్రీవెంకటనాథుఁడే మందు.