ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 18-6 మాళవిగౌళ సం: 10-107
పల్లవి:
నీ వెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో
రావయ్య తిరుపతి రఘరామచంద్ర
చ. 1:
తుమురుగ దనుజులఁ దోలి తొప్పర లాడి
అమరఁగ గెలిచితి నందుపు
మమతతోడుత నిన్ను మదనయుద్ధమునందు
రమణి నిన్ను గెలిచె రఘరామచంద్ర
చ. 2:
తవిలి శివుఁడు కాళి దారకబహ్మ మని
యివల నిన్నుపదేశ మియ్యగా
నవ మై శ్రీవెంకటనాథ మరుతంత్రము
రవళి నీ కీపె యిచ్చె రఘరామచంద్రా.