ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 18-5 కేదారగౌళ సం: 10-106
పల్లవి:
నిండుదొర వౌదు నీగుణము వేలు నిన్ను నమ్మవలెఁబో
పండినమామిడిపై చిలుకవలె పచ్చి దేర నేలతిరిగేవయ్యా
చ. 1:
వనిత కొండంత వలపుతో నీ వరుసఁకు గాచుకుండఁగా
చినుకు జీఁకటి పొద్దున నీ వేడ చెలితో నవ్వేవయ్యా
మనసార నీవె నిప్పువంటిబాస మగువకు నిచ్చి వచ్చితి
అనుగు నామనికోవిలవలె నాడా నీదా నేల తిరిగేవయ్యా
చ. 2:
యింతి సముద్రమువంటి తమకాన యెదురెదురె చూడఁగా
యింతలోఁ గాఁదారి మాఁధారి పొద్దుననెవ్వతెఁజూచేవయ్యా
వంతదీరఁ దాఁచుఁబామువంటి దేవరమీంద నానవెట్టితి
వంతుకు నీ విట్టె జుంటియీఁగవలె వాడ వాడ నేల తిరిగేవయ్యా
చ. 3:
చెలి చుక్క లన్ని కోరికలతోడ చిత్తము నీ కిచ్చుకుండఁగా
పొలసి ముచ్చిమి పొద్దున నెడపూఁబోఁడిఁ బిలిచేవయ్యా
కలికి శ్రీవెంకటనాథ నీవె గారవించి సతిఁ గూడితి
కొలఁకుల నీఁదేరాయంచవలె కోడెకాఁడ యేలతిరిగేవయ్యా