ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 18-1 రామక్రియ - అటతాళం సం: 10-102
పల్లవి:
తలఁపు దలఁపు లెస్స తగు లాయను
కలకంటి యిందుకె నిక్కము వలచెనయ్యా
చ. 1:
యేనుగపై నీవు రాఁగా యింతి పయ్యద జారఁగ
పూని మిద్దెమీఁద నుండి పొసఁగఁ జూచె
ఆని కరికుంభములు అంకుశాన నీ వూఁదిన
కానుక నీ చేఁతలకు గడు వలచెనయ్యా
చ. 2:
నీవు గుఱ్ఱముఁ దోలఁగ నెలఁత చిక్కు దీయుచు
తావుల మేడపై నుండి తప్పక చూచె
కావించి నీ సమకట్లలో నల్ల జల్లి
దూవిన నేరుపుల కెదురు వలచెనయ్యా
చ. 3:
తేరుపై నీ వెక్కి రాఁగా తెఱవ మై పులకించి
చేరువ వుప్పరి గప్పెఁ జెలఁగి చచె
గారవించి వచ్చి శ్రీవెంకటనాథ నీవు గూడ
తారుకాణ చేఁతలకు దగ వలచెనయ్యా