Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 17-6 బౌళిరామక్రియ సం: 10-101

పల్లవి:

గుజ్జనఁగూడు వండెనె కోమలి నేఁడు
గొజ్జువెన్నెలబాయిటఁ గొమ్మలుఁ దాను

చ. 1:

గోమున సేవంతిపవ్వు గురుగులలోపల
యేమరక పూఁదేనె నెసరు వెట్టి
ప్రేమతోఁ బచ్చక ప్రపుబియ్యము కొద్దికిఁ బోసి
దోమటిగా మంచి పూవుఁదోఁటవెంట వాలెను

చ. 2:

మచ్చికఁ బన్నీటను మారెసరుగాఁ బోసి
కచ్చు పెట్టి మల్లెమొగ్గఁ గలయఁ బెట్టి
మెచ్చుల మరువమున మించినట్టి పొం గణఁచి
ముచ్చటఁ బచ్చాకున మూఁకుడు మూసి

చ. 3:

చెలఁగి వట్టివేళ్ల జిబిలికెను వారిచి
కులికి పుప్పొళ్లనే కూరలు వండి
కలికి చుట్టెపు శ్రీవెంకటనాథురతిఁ గూడె
వెలయ నాతనికి విందు వెట్టెనూ