ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 16-5 భైరవి సం: 10-094
పల్లవి:
ఎంతనేరుపరివి ని న్నే మందమే
పంత మాడె యాపె నింత భ్రమయించెఁ జూడరే
చ. 1:
చలపాదియాపె నా సంగడినె వుండఁగాను
వెలఁది రమణుఁ డొక్కవిధము సేసె
అల చుక్కల నెంచవె యని దాని నేమరించి
కళ లంటి నను బిగ్గెఁ గాఁగిలించెనే
చ. 2:
మొక్కళాన యాపె నాతో మొనసి సాటికిరాఁగా
చక్కనిరమణు డొక్కజాడ సేసెనే
అక్కడ దాగిలిముచ్చు లాడి దాని గన్నుమూసి
దక్కి నామో వాని నాకుఁ దమ్ములము వెట్టెనే
చ. 3:
బట్టె గుత్తై యాపె నేఁడు పాయక వద్ద నుండఁగా
యిట్టె శ్రీవెంకటనాథుఁ డిటు సేసెనే
గట్టిగా నాపె కన్నులఁ గప్రమునిండాఁబెట్టి
జట్టిగా నాతోఁ గూడి సమరతి సేసెనే.