Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 16-3 పాడి సం: 10-092

పల్లవి:

సుసరాన మంచి దాయ సుదతులాల
విసుగక పతిఁ దెస్తే వెద లేమి లేవే

చ. 1:

తమ్మితూఁడు లాళమునఁ దగిన కస్తూరివుంట
వుమ్మడినె మదనుఁడు వూదఁగను
కొమ్మ చనుజక్కవల గొబ్బున నెగయఁగాను
కమ్మి వతిపె పయ్యద గలుగఁగ నిల్చెనే

చ. 2:

మొగలిరే కొడిశంట ముదురుఁగ ప్రపులప్ప
వెగటున మదనుఁడు వేయఁగను
అగడై యింతి నడపుటంచలు బెదరఁగాను
వొగిఁ బాదపుపెండెము లోపికె నిలిపెనే

చ. 3:

చెఱకుఁదూఁట సింగిణి చెంగలువ మిట్టకోల
వెఱవక మదనుఁడు వేయఁగను
పఱచికురులతేంట్లు పారఁగా నడ్డ మై కాంతఁ
గఱఁగించి కూడీ శ్రీవెంకటనాథుఁ డాఁపెనే