ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 14-6 కాంబోది సం: 10-083
పల్లవి:
మచ్చికఁ బందిలి వెట్టే మాయకాఁడ
కుచ్చితపు వేరుపుల కుశీలికాఁడ
చ. 1:
పలుకునయమె కాని పస లేదు నేస్తము
వలపులబేరాల వన్నెకాఁడ
మొలకనవ్వులె కాని మోహ మెరఁగ రాదు
నిలువు రాజసముల నీటుకాఁడ
చ. 2:
దవ్వులపొందె కాని దగ్గరఁగ నెడ లేదు
జవ్వనపుమదముల జాణకాఁడ
పువ్వులవాట్లె కాని పొరపొచ్చము మానవు
రవ్వలసరముల రాయడికాఁడ
చ. 3:
తమకపుఁ జూపె కాని తలఁపు దెలియ నీవు
అమరినరతులలో ఆసోదకాఁడ
క్రమమున నన్ను శ్రీవెంకటనాథ నీవె కూడి
భ్రమయించి తౌర వోరి పంతగాఁడా