ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 14-1 దేసాళం సం: 10-078
పల్లవి:
ఒక్కరి నౌ నన నేల వొకరిఁ గా దన నేల
చెక్కు నొక్కి ప్రియములే చెప్పించుకో రాదా
చ. 1:
మేలురా నాతో నీవు మితిమీరి మాఁటాడేవు
ఔలే నాతోడి వాదు కాపో నీవో
యేలరా నీపాలిటికి నిద్దరము సమమే
మేల మాడి సారె సారె మెప్పించుకో రాదా
చ. 2:
ఇప్పుడు నీవె వాసు లెక్కించుక వచ్చేవు
అప్పటి నాతోడి సవ తాపో నీవో
అప్పసమై యిద్దరము నాండ్ల మింతే నీకు
ముప్పిరి దేవరవలె మొక్కించుకో రాదా
చ. 3:
కన్నుల జంకెనలతో గరిసించి యడిగేవు
అన్ని వొట్లకు గురి యాపో నీవో
నన్ను నిట్టె శ్రీవెంకటనాథుఁడ నీవె కూడితి
వెన్నఁడూ నిద్దరి నిట్టె యేలుకొన రాదా