ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 13-6 శుద్ధదేశి సం: 10-077
పల్లవి:
కొండవంటిదొరవు నీగుణ మేల విడిచేవు
వుండరాదా నీ వుండేవొడికానను
చ. 1:
కడుఁ దగవు చెప్పేవు కట్టెకానికలు వెట్టి
అడిగితిమా నిన్ను నయ్యా నేఁడు
బడి బడి నీవు చెప్తే పండితనాయానకు
తొడిఁబడ నెవ్వతైనా తుచ్చ మాడకుండునా
చ. 2:
వెట్టిసాకిరి చెప్పేవు విత్తూఁ దిమ్మిరి వేసి
నెట్టెనఁ గరి గోరేమా నేఁడు నిన్నును
బెట్టిమాఁట లాడి నీవు పిరిదూరి రాఁగాను
గుట్టుచెడ నెవ్వతైనాఁ గోపగించకుండునా
చ. 3:
నీతులు చెప్ప వచ్చేవు నినుఁ బెద్దతన మిచ్చి
ఆతల నడిగితిమా అప్పటినిన్ను
కాతరాన నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
ఘాత రతిలోపల నాకాలు దాఁకకుండునా.