ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 13-4 సామంతం సం: 10-075
పల్లవి:
ఈడేర వలచితే యేపని సేయఁగ రాదు
యేడ నైనా యెగ్గు సిగ్గు లెంచేరా భూమిని
చ. 1:
వనిత చెప్పితే జాలు వారి దైనా నీఁదేవు
అనువుగా గొండ మోవు మన్నా మోంచేవు
తనివోక బూ మెల్లాఁ దవ్వు మన్నాఁ దవ్వేవు
వొనర బహురూపాన నుండు మన్నా నుండేవు
చ. 2:
ఇంతి చెప్పితేఁ జాలు యెంతైనాఁ గొంచెపడేవు
అంతలోఁ బగరఁ జంపు మన్నాఁ జంపేవు
చెంత నాపె తపములు సేయు మన్నాఁ జేసేవు
కాంత దనపసులనుఁ గావు మన్నాఁ గాసేవు
చ. 3:
అతివ చూచి కల్ల లాడు మన్నా నాడేవు
బతిమిఁ బారాడు మన్నాఁ బారాడేవు
పతి వైన కోసువానిపల్లె శ్రీవెంకటనాథ
గతియై కూ డుండు మన్నాఁ గాఁగిట నుండేవు.