Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 13-2 గౌళ సం: 10-073

పల్లవి:

మేర లేనివల పిద మీ కేల తెలుసునే
యీరస మయ్యేబుద్దు లేల చెప్పేరే

చ. 1:

ఆఁట దెంత గబ్బి యన్నా ననుఁడ మీరిఁకవేయి
మాఁట లన్నా వాని నేను మాన లేనే
వేఁటలాడేమదనుఁడు విరహులఁ బొడగంటే
యీ టెలవంటి పూబాణా లేమరుండీనా

చ. 2:

అమ్మరో యంతటికల్ల యన్నా నంటిరి గాని
వమ్ము వోని వానిపొందు వదల లేనే
కమ్మటిఁ జందురుఁడు కాఁకలఁ బొరలేవారిపై
కుమ్మువంటి వెన్నెలలు గుప్పకుండీనా

చ. 3:

అతివ మారాడఁ జెల్ల దన్నా నంటిరి గాని
వెత లేనివానిరతి విడువ లేనే
కతకారై నన్ను శ్రీవెంకటనాథుఁ గూడె
యిత వైనకళ లెల్లా హెచ్చకుండీనా