Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 12-6 రామక్రియ సం: 10-071

పల్లవి:

కాంతాళించాడినమాఁట గాదు సుమ్మీ వోవిభుఁడ
దొంతిమాయలఁ జిక్కఁగ దొరలకుఁ జెల్లునా

చ. 1:

వేడుకతో నీ వాపె వెంట వెంటఁ దిరుగగా
చేడెలలో నెల్ల నాకు సిగ్గాయరా
యీడు లేని వలపు నిన్నెరఁగని దింతే కాక
తోడనె యీ పను లెల్ల దొరలకుఁ జెల్లునా

చ. 2:

వొయ్యనె నీ వాపెకు వూడిగాలు సేయఁగాను
నెయ్యపు నా కపు డెంత నెగు లాయరా
గయ్యాళితమి నీకు కన్నులఁ గప్పెఁ గాక
తొయ్యలికి నింత లోఁగ దొరలకుఁ జెల్లునా

చ. 3:

ఆసపడి నీ వాపెకు అట్టె కొలువు సేయఁగా
యీసున నాకునుఁ గోప మెంత వచ్చెరా
కోసువానిపల్లెలోనఁ గూడి శ్రీవెంకటనాథ
తోసిపోనైతివి యింత దొరలకుఁ జెల్లునా.