ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 12-4 వరాళి సం: 10-069
పల్లవి:
మాటకు మాఁటె యాడి మంచితనము సేయక
నీటున సరస మాడ నేఁడు నాకుఁ జెల్లునా
చ. 1:
ఘనుఁడ వంటా నీకుఁ గానుక చేతి కిచ్చితే
యెనసి నీ వాపెచేతి కియ్యఁ దగునా
ననిచి నీనేరమా నానేర మింతే కాక
నిను దొర వని నమ్మి నేస్తము సేసినది
చ. 2:
కాంతుఁడ వనుచు నావుంగరము వేలఁ బెట్టితే
అంతలో నాపె కిచ్చితి వది దగునా
అంతయు నీకడమలా అది నాకడమ గాక
వింత లేనిపొందు నీతో వేడుకఁ జేసినది
చ. 3:
హితవరి వని నీతో నేకతము చెప్పితేను
అతివతోఁ జెప్పితివి అవురా నీవు
కతకారి శ్రీవెంకటనాథ నన్నుఁ గూడి
బతిమివట్టు కుండఁగా బాసడుగఁ జెల్లునా.