ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 12-3 దేసాళం సం: 10-068
పల్లవి:
కాంతుఁడు మరునియాజ్ఞ కడవలేఁ డింతే కాక
కొంతై న నెరఁగఁడా కోన చెన్నరాయఁడు
చ. 1:
వలపు నిలుప లేక వనితకు మొక్కెఁ గాక
సొలప వాఁ డటువంటి సుద్దులవాఁడా
చెలిమి విడువ లేక చెయివూఁత యిచ్చెఁ గాక
కొలమున నేమి తక్కువవాఁడా
చ. 2:
ఆసలు మానఁగ లేక ఆకు మడి చిచ్చెఁ గాక
వేసాల వాఁ డటువంటి విద్యలవాఁడా
బాసలు దప్పఁగ లేక బడినె తిరిగెఁ గాక
యీసున దొరతనము లెఱఁగనివాఁడా
చ. 3:
పొందు విడువఁగ లేక పొత్తున భుజించెఁ గాక
అందగాఁ డాతఁ డెంగి లంటేవాఁడా
అంది శ్రీవెంకటనాథు డాపెఁ గూడితే నేమి
చందముగా నాతోడి సమరతి మానేనా.