ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 12-2 పాడి సం: 10-067
పల్లవి:
రావయ్య వావిలిపాటి రామచంద్ర
రావాడివలపులు రామచంద్ర
చ. 1:
మూఁగినసబలలోన ముంచి మాఁటలాడఁగాను
రాఁగెఁగా నీ మోవికెంపు రామచంద్ర
మాఁగినమాఁటలనె మర్మము లెత్తితి నని
రాఁగతనాలు మానుమీ రామచంద్ర
చ. 2:
బట్టెబయలుమాఁటల బాసలు సేయ రాఁగా
రట్టాయ నీ సుద్దులు రామచంద్ర
గుట్టు దెలిసినందుకు కోపగించుకొనకుమీ
రట్టెడిచేఁతల వో రామచంద్ర
చ. 3:
ఆసలమాఁటల నన్ను నలమి పట్టఁగ నిన్ను
రాసెఁగా నా కొనగోరు రామచంద్ర
వేసాలు మాని నన్ను శ్రీవెంకటనాథుఁడ వై
రాసి కెక్కఁ గూడితివి రామచంద్ర.