Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 11-4 సామంతం సం: 10-063

పల్లవి:

ఆఁటదాఁన గనక నే నాసలు మానలేఁ గాక
యేఁటికి మాచక్కఁదనా లింపు గాని నీకున

చ. 1:

వాడికై ననాఁటికి వలతు వింతే కాక
నేఁడు బాస చెల్లించ నీ కేలయ్యా
వాడుదేరుకూలికి వలచిని వలపులు
యీడేరించుకొనేది‌ యింత పిన్నపనులా

చ. 2:

పనిగల యప్పు డెల్లాఁ బైకొందు వింతే కాక
ననిచి యెప్పుడూ నేల నడుపేవయ్యా
చెనకి గడ్డాయముగాఁ జేసినబాస లెల్ల
అనువుగా నడపఁగ నల్లాడఁ బడెనా

చ. 3:

చిత్తము నిలుప లేక శ్రీవెంకటనాథుఁడ
హత్తి కూడితివి గాక అల పేలయ్యా
కొత్తగాఁ దమకముఁ గూడినకూట మెల్లా
తత్తరపడక యుండఁ దమయిచ్చటా.