ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 11-3 మాళవిగౌళ సం: 10-062
పల్లవి:
ఇంచుక యస మిచ్చితే యెవ్వరూ నేల మానేరు
కొంచేవా నీ విఁకఁ గోన చెన్స్నరాయఁడ
చ. 1:
మొగము చూచి వలచి ముందు ముందె నీకుఁగేలు
మొగిచి మొక్కినదె వె మాయఁగా
సగముచూపులఁ జూచి జూణతనా లాడేవు
తగునా చేఁతకు నీచేఁతలు వో విభుఁడా
చ. 2:
కలికి నీచేఁతలకు కాఁక రేఁగి నాకు నేనె
నిలిచి మాటాడినదె నేర మాయఁగా
చిలుకుగోళ నూఁది చేరి సరస మాడేవు
తలఁపనందుకు నీవు తగునయ్య విభుఁడా
చ. 3:
అగ్గలపు వేడుకతో నలపు దీర నీమీఁద
దగ్గరి చేయి చాచుటే తగు లాయఁగా
వెగ్గళించి కూడితి శ్రీవెంకటనాథుఁడ నన్ను
సిగ్గుదీర నిదె కోనచెన్నరాయఁడవై.