ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 10-2 భైరవి సం: 10-055
పల్లవి:
తనువె యిక్కడఁ గాని తలఁ పెల్లా నక్కడనె
మనసులో నాపె నింక మాననైనఁ గలవా
చ. 1:
మాయింటాడ నిచ్చకపు మాఁటలాడే వింతే కాక
వోయీ నీ వాసెఁ బాసి వుండ నోపేవా
ఆయెలే మాముందటను అసము దించవు గాక
చేయూర నీవె యాపెను చెనక కుండేవా
చ. 2:
మానలేనివానివలె మన సరసేవు గాక
ఔనా ఆపె వడ్డించ కారగించేవా
తేనెలమాఁటఁల దరితీపులు సేసేవు గాక
కానీలె యాపెపై తమకమె పట్టెఁగలవా
చ. 3:
యీపొద్దుకు నాకాఁగిలి యింపాయ ననేవు గాక
పో పో నీవాపెఁ దలపోయ కుండేవా
కాపాడి నన్నును శ్రీవెంకటనాథ కూడితివి
మాపొందు లాసెవద్దను మఱవఁగఁ గలవా