Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 10-3 కాంబోది సం: 10-056

పల్లవి:

ఇరుమొనసూది వనియింపు సేసుకుందుఁగాని
మరిగినే మన సిచ్చి మాఁటలాడఁ జాలరా

చ. 1:

ఆపెతోఁ బురుడువెట్టి ఆడక వుండినఁ గదా
నాపై నీవల పెల్ల నమ్ము కుందును
చూపుల నాపె కెదురుచూడక వుండితేఁగదా
చేపట్టి నాముచ్చ టెల్లాఁ జెప్పుదు నీతోను

చ. 2:

ఇచ్చక మాపె కాడక యీడనె వుండినఁ గదా
ఇచ్చిన నీబాస లెల్ల నియ్యకొందును
కచ్చుపెట్టి యాపెతో నేకతము మానినఁ గదా
తచ్చనలు మాని నీతో దగ్గరి నవ్వుదును

చ. 3:

కడలు దొక్కక నాకాఁగిట నుండినఁ గదా
అడియాలముగఁ గళ లంటుదు నిన్ను
కడువేగ శ్రీవెంకటనాథ నీవె నన్ను
యెడయక వుండఁగానె యితవాయఁ గాకా