ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 10-1 మాళవిగౌళ సం: 10-054
పల్లవి:
మంచితనము ల దెట్టు మరచీనయ్యా
మంచముపై నున్న నెట్టు మరచీనయా
చ. 1:
యెచ్చరించి వొక రొక రెనసి కూడుండేటి
మచ్చికలు చెలి యెట్టు మరచీనయ్యా
వచ్చినదాఁకాఁ దలవాకిటనె కాచుకుండే
మచ్చులచేఁత ల దెట్టు మరచీనయ్యా
చ. 2:
యిత వెరిఁ గొక రొక రిచ్చకాలు సేసేది
మతిలోనఁ జెలి యెట్టు మరచీనయ్యా
సతతము నొండొరుల జవ్వనమె కుదువైన
మతములు చెలి యెట్టు మరచీనయ్యా
చ. 3:
సంతసాన మనసులే సరిదాఁకినట్టి నీ
మంతనాలు చెలి యెట్టు మరచీనయ్యా
కాంతను నీవె శ్రీవెంకటనాథ కూఁడగాను
మంతు కెక్కె నిది యెట్టు మరచీనయ్యా