Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 09-6 పాడి సం: 10-053

పల్లవి:

కాదని వేగిరించితే కరఁగీనా ఆతఁ డేమి
వాదు మాని వచ్చినట్టె వచ్చేదె చాలును

చ. 1:

మాఁట లాడించకురే మదనమంత్రాలు దప్పీ
నేఁటిదాఁక నాపెవద్ద నేరిచినవి
నీటుతోడ నాతనిని‌ నిండునిధానమువలె
సూచీచూపుల మనము చూచేదె చాలును

చ. 2:

గందము వూయకురే యంగజునిముద్రలుమాసీ
కందువ నిన్నాళ్ల దాఁకా గడించినవి
దిందుపడ నుపారము దేవరకుఁ జూపినట్టు
ముందర నన్నియుఁ బెట్టి మొక్కేదె చాలును

చ. 3:

మల్లాడి తియ్యకురె మన్మథయోగ మెడసీ
తొల్లియూ నాపెవలన దొరకినది
కల్ల గాదు నన్ను శ్రీవెంకటనాథుఁడె కూఁడె
చెల్లుబడి నీచనవు చేకొనేదె చాలును