ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 09-5 దేసాళం సం: 10-052
పల్లవి:
కలితె నానతీవయ్యా కానిదానికి నేమి
చెలరేఁగి ఆపె మాఁట చెల్లించేఁ గాని
చ. 1:
వెడ్డువెట్టి నే నిన్ను వేడుకతోఁ గొసరఁగా
అడ్డాలు వచ్చీ నాకంటే నంత చుట్టమా
వొడ్డినగర్వాన నాతో వొరగోసుకొన్నది
సడ్డలాడి నీ వింత చనవు లిచ్చితివా
చ. 2:
బాసగొని నే నిన్ను పై పైఁ బలుకఁగాను
యీసడించీ నాకంటే యితవరా
గాసిలి మచ్చరాన నీకాంత మాసటీనివలె
సేసిన చేఁతల కల్లా చెల్లుబ డిచ్చితివా
చ. 3:
యీపొద్దె నిన్ను మాయింటికిఁ దోడుక పోఁగా
కోపగించీ నాకంటెఁ గూరిచినదా
కైపు గాక నన్ను శ్రీవెంకటనాధ కూడితివి
పై ఫై నాపెకుఁ బారుపత్యము లిచ్చితివా.