ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 08-6 వరాళి సం: 10-047
పల్లవి:
ఆపె యెరుఁగును నీ వన్నియూ నెరుంగుదువు
రేపు మాపు నే నెచ్చరించేనా విభుఁడ
చ. 1:
చిలుకచే మాఁటలు చెప్పెంప్పి మరు
చిలుకలపాలుగఁ జేయ నేల
కల గని లేచి లేకలు వ్రాసి కాఁ
కలఁ బొరలుచునె నీకడ కంపెఁ జెలియా
చ. 2:
కడువేగ ముదుర వుంగరమె యంపి మరు
కడివోని బాణాలఁ గాఁచ నేల
బడి బడి విరహనఁ బడలేక మా
పడఁతి నీకుఁ జిత్తరుపట మంపె నిదివో
చ. 3:
విందువలెఁ గప్పురపు విడె మిచ్చి గో
విందుఁడ వయిన శ్రీవెంకటనాథ
కందు లేనివేడుక నాకందుకొని నీ
కందువ లంటి కూడెఁ గాంతయు నిన్నిపుడూ