Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 09-1 కేదారగౌళ సం: 10-048

పల్లవి:

ఎందరి దూరె యెవ్వరి వేఁడె యెంతని వేగించేనె
పొందు దలఁచుక వచ్చెనా వానిచే పుణ్యమింతే కాక

చ. 1:

పుక్కిలిబంటి కాఁకలలోనె పొద్దువోవు టెట్లే
యెక్కువైన నా వమోహము చెలుల నెరఁగ రేమందునే
వొక్కనిమిషము వానిఁ బాసి నేవోరువఁ గలనటే
మొక్కళీఁడయిన మరునమ్ములకు మొకవమోట గలదా

చ. 2:

తలమునుకల విరహము నే ధరియించు టెట్లే
వల పెరిఁగియు సకులు మీరైన వానిఁ దే రేమందునే
అలిగినవానిఁ బాసి నిమిషము ఆఁపఁ గలనటవే
దళమై కప్పెటి పూవుటమ్ములకు దయగల దటవే

చ. 3:

ఇట్టె యీఁదరాని తమకముననె యీడేరే దెట్లే
వొట్టిన నా కాఁక లెరిఁ గింతు లూరకున్నారేమందునే
నెట్టెన శ్రీవెంకటనాథుడు నేఁడు నన్నుఁ గూడెనే
గట్టిగ నాయింట కాఁపురమున్నాఁడు కడమలున్న వటే