ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 08-5 వరాళి సం: 10-046
పల్లవి:
తెలిసినమాఁట తేటతెల్లమిగాఁ జెప్పేను
తలిరుఁబోణి విభునిదండ నుండవలెనా
చ. 1:
ముదిత మేని పులక మొలకలు పన్నీటి
పదనునఁ దీఁ గెలువారీఁ జుండి
కదిసి వోచెలులాల గందవొడి పొదిచేత
అదన నవియుఁ బొదలయ్యీఁ జుండి
చ. 2:
చెలి చనుఁగొండలపై చెమట వూట పూఁదేనె
నలుకఁగాఁ గాలువలయ్యీఁ జుండి
కలికికోరికలచే కన్నుల నీరు గూడఁగా
యిలపై మదనుపేరి టేరులయ్యీఁ జుండి
చ. 3:
కాంతమదిలోఁ బతి గడు గడుఁ దలఁచఁగా
అంతటా నాతఁడె తా నయ్యీఁ జుండి
వింతగా నింతిని శ్రీవెంకటనాథుఁడు గూడె
పంతమునఁ జెలికిఁ దాపము మాఁనె జుండి.